అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు

పాలకొండ నియోజకవర్గం: జగన్ రెడ్డి నీవు నీ చేతగాని ప్రభుత్వం చేసే పనులు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడుతున్నారని జనసేన జానీ అన్నారు. శనివారం జానీ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పుపై చెలరేగిన ఆందోళనకారులపై వందలాది కేసుల ఉపసంహరణ ఎందుకు చెయ్యడం లేదు. మీరు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచి విగ్రహాలు పెట్టడం వలన ఓట్లు వస్తాయి అనుకోవటం తెలివి లేని చర్య. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకి పెడితే వేలాదిమంది మారణ హోమం సృష్టిస్తే ఆ కేసులు మొత్తం ఎత్తివేస్తూ జీవో ఇచ్చి అంబేద్కర్ గారిని దారుణంగా అవమానించిన వ్యక్తివి జగన్ రెడ్డి మీరు అంబేద్కర్ గారిని అవమానించిన చేతులతో విగ్రహాన్ని ఆవిష్కరించటం అత్యంత హాస్యాస్పదం. ఈ రాష్ట్రంలో దళిత బహుజన బిడ్డలకు తీరని అన్యాయం చేసిన దళిత ద్రోహి మీరు దళితులకు సంబంధించిన 26 పథకాలు రద్దుచేసి రాజ్యాంగ పరంగా సబ్ ప్లాన్ నిధులు మొత్తాన్ని దుర్వినియోగం చేసిన అత్యంత అవినీతి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత పేరు ఒక జిల్లాకు పెడితే మరణ హోమం సృష్టించి, రాష్ట్రంలో దళిత బహుజన ప్రజాస్వామ్యవాదుల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వ జీవో పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తాం. ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా 2024లో దళితులందరూ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని గద్దె దించటం ఖాయం. ఎందుకంటే దళితుల జీవితాలుతో ఆడుకున్న ప్రభుత్వం మీది. పైగా అంబేద్కర్ ఆశయాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం అత్యంత శోచనీయం. రాష్ట్రంలో దళిత బిడ్డలపై జరిగిన రాజకీయ ఆర్థిక సామాజిక దోపిడీకి జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. 2024లో జగన్ ప్రభుత్వం చేసిన అవినీతిని దళిత బిడ్డలకు చేసిన ద్రోహాన్ని గడపగడపకు పరిచయం చేసే కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అంబేద్కర్ జిల్లా పేరు పెట్టిన కారణంగా చెలరేగిన హింసాకాండలో పాల్గొన్న ఆందోళనకారుల మీద ఉన్న కేసుల్ని ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి నాంది పలకాల్సి వస్తుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ ఇచ్చిన అక్రమ జీవోపై తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాల్లో ప్రభుత్వ మెడలు వంచటం ఖాయం అని జనసేన జానీ అన్నారు. ఈ కార్యక్రమంలో దొర భాను ప్రసాద్, జామి అనిల్ పాల్గొన్నారు.