నిర్ణయాధికారం మాదే.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం కూడా ఇదే విషయాన్ని తెలిపిందని గుర్తుచేసిన జగన్ సర్కార్. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఆమోదం తర్వాత ఆఫీసుల తరలింపుపై పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు న్యాయ సమీక్షార్హం కాదని తెలిపింది.

రాజధాని సహా అభివృద్ధి ప్రణాళికలు, వివిధ ప్రాజెక్టులు సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వాగ్ధానం చేసిందని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం గుర్తుచేసింది. ప్రత్యేక హోదా అమలుకానంత వరకు విభజన ప్రక్రియ అసంతృప్తిగానే మిగిలిపోయిందని భావించాల్సి ఉంటుందని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.