రాజంపేట జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

#jaganmosam

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన తర్వాత నిర్వాసితులైన వందలాది కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల లోపు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు పునర్నిర్మాణం చేసి వారికి కొత్త ఇంటి కల సహకారం చేస్తానని గత సంవత్సరం డిసెంబర్ లో వరాలు కురిపించి వెళ్లి దాదాపు సంవత్సరం అవుతున్నా.. నిరాశ్రయులైన వారికి ముందుగా ఇల్లు కట్టి ఇస్తామని తర్వాత బేసి మట్టం వేసుకున్న తర్వాత బిల్లులు చెల్లిస్తామని కట్టుకొని పక్షంలో తిరిగి ఆ స్థలాలను లాక్కుంటామని బెదిరించగా స్థలం తీసుకున్న ఆ ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని నమ్మకంతో అప్పులు చేసి బేసి మట్టం వేసుకుని దాదాపు 6 నెలలు అయినా కూడా బిల్లు కూడా చెల్లించలేదని చాలామంది ఆ ప్రాంతాలు వదిలి వలస వెళ్లిపోయారని, అలాగే అక్కడ ఇచ్చిన స్థలాలు కూడా ఇదివరకు ఇచ్చిన దళిత కుటుంబాల నుంచి మూడు ఎకరాలు లాక్కొని ఇల్లు కూలిపోయిన వారికి ఐదు సెంట్లు స్థలం ఇచ్చి పేరు మాత్రం జగనన్న కాలనీలు అని పెట్టుకుంటున్నారని, పెట్టుకున్నా కూడా బిల్లులు చెల్లించలేదని అప్పులు చేసుకున్నా ఇల్లు పూర్తి గాక ఇల్లు లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆయా ప్రాంత ప్రజలు వారి బాధను జనసేన నాయకులకు తెలియచేశారు.

పులపత్తూరు పంచాయతీలో ఊరు మొత్తం కొట్టుకొని పోగా రోడ్డుకు ఒకవైపున ఉన్న వైసీపీకి ఓటు వేసిన వర్గానికి మాత్రమే ఇంటి పట్టాలను ఇచ్చారని ఓటు వేయని దళిత సామాజిక వర్గానికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆ ప్రాంత పేదలు తెలియజేశారు.

అధికారిక లెక్కల ప్రకారం డబ్బులు ఇచ్చేసినట్లు చూపిస్తున్నా బిల్లులు పేద ప్రజలకు అందకపోవడం జగనన్న హౌసింగ్ స్కాం అని పేదల ఇళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అతిపెద్ద స్కాం జరిగిందని నిధులను పక్కదారి పట్టించారని దీని మీద సమగ్ర సర్వే జరిపి పులపత్తూరు దళిత కుటుంబం పాటూరు వెంకటసుబ్బమ్మ కుటుంబం నుంచి లాక్కున్న భూమికి ప్రభుత్వం పరిష్కారం చెల్లించాలి లేదా ప్రత్యామ్నాయ మార్గంగా వేరే చోట భూమిని వారికి ఇవ్వవలసిందిగా అలాగే నిరాశ్రయులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వమే సత్వరమే ఇల్లు నిర్మించి అలాగే పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయవలసిందిగా చేస్తున్నామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్నో ఆశలతో కడప జిల్లా బిడ్డ సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకుని ఓటు వేసిన ప్రజలను నట్టేటిన ముంచేసింది ఈ ప్రభుత్వం అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఎం వెంకటేశ్వరరావు గారు వైసీపీ వైఖరి మీద తీవ్రంగా మండిపడ్డారు.
తాడేపల్లి పాలెస్ లో పనిచేస్తున్న సీఎం ప్రజలలో సమస్యలను పరిష్కరిస్తే తప్ప వైసీపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఎదుగుతున్నదని పేదల తరఫున ఈ ప్రభుత్వంతో పోరాడి అన్నమయ్య డ్యాం కోల్పోయిన ప్రాంతాలలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని రాజంపేట జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ వారికి మాట ఇచ్చారు.

రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నమయ్య డ్యాం ద్వారా నష్టపోయిన ప్రాంతాలకు తీసుకొస్తామని జనసేన పార్టీ నాయకులు కత్తి సుబ్బరాయుడు, వీరయ్య ఆచారి, భాస్కర పంతులు, తాళ్లపాక శంకరయ్య తదితరులు ఆయా ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చారు.

జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కడప జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బరాయుడు, జడ్డా శిరీష చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు చంగల్ రాయుడు, గోవర్ధన్ ఆచారి, భాస్కర పంతులు వీరయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.