జగనన్న లేఅవుట్ లలో మౌలిక సౌకర్యాలు శూన్యం: ఆగూరు మని

  • జగనన్న కాలనీలలో పార్వతీపురం జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పార్వతీపురం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు #Failure of Jagananna Colony కార్యక్రమంలో భాగంగా శనివారం నర్సిపురం గ్రామం జగనన్న లేఅవుట్ ను జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మని, జనసేన నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లు గణేశ్వరరావు, కర్రీ మణికంఠ, పైల అప్పలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గం, నర్సిపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్ లో మౌలిక సౌకర్యాలు శూన్యమని జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మని అన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జగనన్న కాలనీ లే అవుట్ లోని పరిస్థితిని పరిశీలించడం జరిగింది. సాధారణంగా లేఅవుట్ ఏర్పాట్లు చేసేటప్పుడు ముందుగా రోడ్లు, డ్రైనేజీలు, నీరు, విద్యుత్ సమస్యలు, తదితర మౌలిక ఏర్పాటు చేశాకే ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు, ఇల్లు నిర్మాణాలకు అవసరమైన నీటి సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ, డ్రైనేజీ వ్యవస్థ గాని, ఏర్పాటు చేయకుండానే లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇల్లు నిర్మాణాలు చేయని యెడల మీయొక్క ఇంటి స్థలాలను తిరిగి తీసుకుంటామని బెదిరిస్తున్నారు, ఇంటి నిర్మాణానికి మీరు ఇస్తున్న డబ్బులు చాలక అప్పులు చేసి ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు. కొన్ని ఇల్లు నిర్మాణాలు జరిగినప్పటికీ కొన్ని పునాదుల దగ్గరే ఆగిపోయాయి. కొన్ని ఇల్లు పూర్తిగా పునాదులు వెయ్యని స్థితిలో ఉన్నాయి వర్షాకాలం వచ్చిందని ఈ కాలంలో ఇంకా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతాయో అధికారులు పాలకులు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన నాయకులు చెప్పారు. దుర్గాప్రసాద్, బండపల్లి ప్రసాద్, గంట నాగరాజు, తిరుపతి, కేశవరావు, శంకర్, పవన్, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.