చాట్రాయిలో “జగనన్న మోసం” డిజిటల్ క్యాంపెయిన్

నూజివీడు, చాట్రాయి, 12 మరియు 13వ తేదీలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనలతో “జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు” అనే కార్యక్రమం మండలంలో ఉన్న చాట్రాయి, చిత్తపూరు, చనుబండ, సూరంపాలెం, నరసింహారావు పాలెం, బూరుగు గూడెం, పిట్టవారిగూడెం గ్రామాలలో “జగనన్న మోసం” డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మొత్తం 546 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లలో ఒక్కడి కూడా పూర్తవలేదని, గ్రామాలలో జగనన్న కాలనీ పేరిట లేఔట్లు మాత్రమే ఉన్నాయని, తుమ్మ చెట్లు మొలిసి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా జగనన్న కాలనీలు మారుతున్నాయని, పేదవాడి సొంతింటి కలకలగానే మిగిలిపోతుందని మండల ప్రజలు వాపోయారు. వారికిచ్చిన ఇళ్ల పట్టాలతో బ్యాంకుల్లో రుణాలు పొందవచ్చు అని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు పచ్చి అబద్దాలని, బ్యాంకులలో అవి చెల్లవని, కనీసం నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రావని ప్రజలు వారి గోడు వెళ్ళబుచ్చుకున్నారు.