జగనన్న ఇళ్లు ప్రభుత్వ మాయ

  • జగనన్న కాలనీల్లో జనసేన నాయకులు నిరసన

రాజంపేట, రాష్ట్రంలో పేదల కోసం ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీల్లో ప్రభుత్వ గారడితో సృష్టించినవని రాజంపేట జనసేన నాయకుడు తాళ్లపాక శంకరయ్య ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఆదివారం రాజంపేట మండలంలోని అప్పా రాజుపేట పంచాయతీ పోలి గ్రామంలో జగనన్న కాలనీలు పేదల ప్రజల కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈగృహ లబ్ధిదారులకు మంజూరు చేసిన నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ప్రజలకు పట్టాల రూపంలో ఇవ్వడం జరిగిందని 90 శాతం నిర్మాణ పనులు చేపట్టామని వైసిపి ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రాళ్లగుట్టల్లో వన్యప్రాణుల సంచరించే కొండల ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి నిర్మాణం చేయాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. అలాగే మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఇంటి నిర్మాణానికి సరైన సహకారం ప్రభుత్వం నుండి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేయలేకపోతున్నారన్నారు. ఈ చేతగాని ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఇకనైనా పేదల గృహాలు ప్రభుత్వమే కట్టించాలని జనసేన పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వెంకటయ్య, సుబ్బమ్మ, సుబ్బరాజు, నరసింహులు, వెంకటస్వామి, గంగమ్మ, సింధు తదితరులు పాల్గొన్నారు.