స్పీకర్ ఇలాకాలో జగనన్న ఇల్లు పరిస్థితి ఇది..

ఆముదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం రాపాక గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలని పొందూరు మండలం నాయకులు కొంచాడు చిన్నమునాయుడు, జామాన అప్పలనాయుడు, గార బాబురావు, చిమ్మి నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున జగనన్న కాలనీలుని పరిశీలించడం జరిగింది. సామాన్యులకి ఇచ్చిన ఇళ్లలు గురుంచి, కొంచడా చిన్నమునాయుడు మాట్లాడుతూ పట్టాలిచ్చి మూడేళ్లు అయినా ఇప్పటివరకు అక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేదు,వాటర్ ఫెసిలిటీ లేని దగ్గర ఇచ్చారు. అన్ని సదుపాయలు కలిపించి, ఇల్లు స్థలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత తొందరగా ఇల్లు నిర్మించి పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు.