జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

రాజానగరం నియోజకవర్గం, జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ శుక్రవారం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం చేయబోతున్నామని తెలిపారు. జగనన్న ఇళ్లు అనే వీళ్ళ నవరత్నాలలో ఒక రత్నం రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాంగా మారిందని తెలిపారు. పేద ప్రజలకు భారీగా మోసం చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అర్థం అయ్యే విధంగా అన్ని గ్రామాల్లోనూ ఎక్కడైతే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు ఉన్నాయో ఈ 3 రోజులు పర్యటించి అక్కడ పరిస్థితులు వీడియోలు, ఫోటోల రూపంలో #JagannnaMosam అనే హాష్ టాగ్ తో తెలియజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 38 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తామన్న ప్రభుత్వం మొదటి విడతలో 18 లక్షల ఇళ్లు 2022 జూన్ నెల లోపు పూర్తి చేస్తామని చెప్పి, కేవలం 1.5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, సీతానగరం మండల కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, కోరుకొండ మండల కో -కన్వీనర్ ముక్క రాంబాబు, చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, గాదరాడ జనసేన పార్టీ నాయకులు అరుబోలు బాలు, తన్నీరు తతాజీ, అడపా అంజి, కోలా జాన్ ప్రసాద్, పోసిబాబు, మేడిద వీరబాబు, తెలగంశెట్టి శివ, కూనవరం సత్తిబాబు, జనసేన వీరమహిళ కందికట్ల అరుణ, అడబాల హరి, సతీష్, సురేష్, సోడసాని శివాజీ, రాయపాటి హరీష్, చిక్కాల నాగ శ్రీను, ఎవకుల భగవాన్, తొరటి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.