గిరిజన విశ్వవిద్యాలయం పేరుతో భూ దందా!

  • గిరిజన జే ఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ జిల్లా చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర

నెల్లిమర్ల నియోజకవర్గం: గిరిజన విశ్వవిద్యాలయం పేరుతో రైతులను మోస౦ చేస్తూ యూనివర్సిటీ స్థలం సేకరించి కాసుల కోస౦ యూనివర్సిటీపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గిరిజన జే ఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ జిల్లా చైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో మెంటాడ మండలంలో కుంటినవలస పరిధిలో శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ యూనివర్సిటీ కోసం సాలూరు నియోజక వర్గంలో మెంటాడలో సగభాగం గజపతినగరం నియోజక వర్గంలో దత్తిరాజేరు మండలంలో సగభాగం భూ సేకరణ చేశారు. అయితే ఇక్కడే అనుమానాలువున్నాయి. ఐదు వందల అరవై ఎకరాలు పై బడి భూసేకరణ చేశారు. అందులో ఎనభై ఎకరాలు జిరాయితీ భూమి, నాలుగు వందల ఎకరాలు పై బడి ప్రభుత్వ భూమిని సేకరించగా!! ప్రభుత్వ భూమికి నష్ట పరిహారంగా ఎకరాకి ఏడు లక్షలు జిరాయితీకి పదకొండు లక్షలు రూపాయిలు చెల్లించారు. ఇందులో సగమంది రైతులకు సగం మాత్రమే చెల్లించారని. ఇంకొంతమందికి దొంగ పట్టాలని బెదిరించి అరవంతు మాత్రమే చెల్లించారని దళిత రైతులు వాపోతున్నారు. అలాగే బీసీ వర్గాల రైతుల వద్ద సేకరించిన భూమికి కూడా పూర్తి స్థాయిలొ చెల్లించలేదని అక్కడి అన్ని వర్గాల రైతులు వాపోతున్నారు. అది కాక జీడీ మామిడి మొక్కలకు కూడా చెల్లించ లేదు. కాని సుమారు నలభై కోట్లు రూపాయిలు రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్టు లెక్కలు చెప్తుంటే స్థానిక ఎమ్మెల్యేల చేతివాటం ఇక్కడే తెలుస్తూ అనుమానాలకు దారి తీస్తున్నాయి. యూనివర్సిటీ ప్రకటించక మునుపే ఆ పేరుతో ముందే చుట్టూ పక్కలభూములు కొని అప్పుడు యూనివర్సిటిని తరలించి. రైతులను మోస౦ చేస్తూ యూనివర్సిటీ స్థలం సేకరించి కాసుల కోస౦ యూనివర్సిటీపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజ నిజాలు తేల్చాలని సంబంధిత అధికారలను కోరుకుంటున్నాం.. ఇలా అడగడానికి కారణం గత ప్రభుత్వంలో ఎస్ కోట నియోజకవర్గంలో యూనివర్సిటికోస౦ ఐదు కోట్ల రూపాయలతో చదను చేసి ప్రహరి గోడ నిర్మించి మరియు భూసేకరణ చేసి భూమి ఇచ్చిన గిరిజన రైతులకు పక్కనే ఉన్న కొండ మీద భూమి ఇస్తామని మాట ఇచ్చి అరవై ఐదు లక్షల రూపాయలతో కొండను చదును చేశారు. కాని గిరిజనలకు భూమిని అప్పగిచనలేదు. ఇప్పుడు అక్కడ సేకరించిన స్థలాన్ని ఏపీ ఐఐసి ఆ స్థలాన్ని కేటాయించి. ఇప్పుడు మరలా కొత్తగా భూసేకరణ, శంకుస్థాపన అని నలభై కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేయడం ఎంత వరకు సమంజసం? అదికాక విశాఖపట్నంనకు అనుకొని ఉన్న చోట ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయి౦ధి. కాని భూ సేకరణకి కోటి రూపాయలు కూడా ఖర్చు కాలేదు.. కాని ఏజన్సికి అనుకొని ఉన్న ప్రాంతంలో నలభై కోట్ల ఖర్చు చూపడంపై మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే సంవత్సారానికి రెండు పంటలతో కల కలలాడే చొటుని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మార్చుకోవడం అనేది ప్రకృతిపై ప్రేమ తెలుస్తుంది. కేవలం ఒక బడా నాయకుడి కుటుంబం కోసం, స్నేహితుల కోసం, వృక్ష జీవాలను బలి చేస్తూ ప్రకృతితో వ్యాపార౦ చేయడం ఎంత వరకు న్యాయమో నాయుకులే తేల్చాలని అప్పలరాజు దొర పత్రికా ముఖంగా కోరారు.