జగిత్యాల జనసేన ఆత్మీయ సమావేశం

జగిత్యాల నియోజకవర్గం, జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ బెక్కం జనార్ధన్ ఆధ్వర్యంలో ముఖ్య క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీలో వేసే వివిధ కమిటీల గురించి వివరించడం జరిగింది. పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రజా సమస్యలపై పోరాడటానికి సిద్దంగా ఉండాలని అలాగే జగిత్యాల నియోజకవర్గంలోని మిగతా 3 మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి కార్యకర్త పార్టీ కోసం ముందుండాలని చర్చించారు. ఈ సమావేశంలో జగిత్యాల మండల పార్టీ కార్యకర్తలు బాలు, రాము, హుస్సేన్, నవీన్, రాకేశ్ మనోజ్, నరేష్ మరియు విజయ తదితరులు పాల్గొన్నారు.