దళితవాడల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గుంటూరు: గుంటూరు నగర స్థానిక 53,54,55 వార్డ్ లలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వేంకటేశ్వర రావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గాదె వేంకటేశ్వర రావు మాట్లాడుతూ.. జనసైనికుల శ్రేయస్సే జనసేన శ్రేయస్సు, పార్టీ జెండా పట్టుకుని పనిచేసిన ప్రతిఒక్క కార్యకర్తకు భద్రమైన భవితవ్యం అందిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాన్నున్న 12 రోజుల్లో రోజుకి ఒక ప్రాంతం చొప్పున 3 డివిజన్ లలో విస్తృతంగా నిర్వహిస్తాము. ఈ కార్యక్రమాని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి కృషిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శులు శ్రీమతి మల్లీశ్వరి, కొడిడిటి కిషోర్, 53వ వార్డ్ అద్యక్షుడు కొండూరు శ్యామ్ ప్రతాప్ కుమార్, 54వార్డ్ అధ్యక్షుడు వెజ్జు రాజేష్ మరియు బి. చంద్రా నాయుడు, సజ్జా కాటయ్యా, ఆకుల ప్రసాద్ మరియు స్థానిక జనసైనికులు, వీరమహిళలు పాల్గొని విజయంతం చేశారు.