ఘనంగా రాజశేఖర్ జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి పట్టణ ఐదవవార్డ్ ఇంచార్జి, పట్టణ నాయకులు అంపిరయిని రాజశేఖర్ జన్మదినోత్సవాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు జనసేన పట్టణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖరతో కట్ చేయించి కేకు తినిపించారు. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ రాజశేఖర్ జనసేన కుటుంబంలో ఒకరని ఆయన జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యుల జన్మదినంగా భావించి జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, 7వ వార్డ్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, ప్రచార కమిటీ మెంబర్ బత్తుల కేశవ, జనసేన నాయకులు అంచుల ఉదయ్ భాస్కర్, నామాల పుష్ప, రామిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.