నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జనసేన ఆవిర్భావ సభ: నేరేళ్ళ సురేష్

గుంటూరు, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఆవిర్భావ సభతో పెను మార్పులు రానున్నాయని, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరగనుందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో జరగనున్న ఆవిర్భావ సభ పోస్టర్లను శనివారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఆవిర్భావ సభకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణం అని నామకరణం చేయటం ఎంతో ముదావహం అన్నారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు ఎన్నో దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల రాజకీయ గురువైన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య మరణించినప్పుడు కనీసం సానుభూతి కూడా తెలియచేయకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆర్యవైశ్యులకు జనసేనలో సముచిత స్థానం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు జనసేనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గుంటూరు అర్బన్ నుంచి ఇరవైవేల మందికి పైగా సభకు తరలివెళ్లనున్నారని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అరాచకాలు, దందాలు, దాష్టీకాలతో సాగుతున్న వైసీపీ రాక్షస పాలన అంతం కావాలి అంటే అది ఒక్క జనసేనకే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని నీతివంతమైన పాలనకై ప్రజలు జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. మచిలీపట్నంలో జరగనున్న సభకు జనసైనికులు, వీరమహిళలు భారీగా తరలిరావాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు ఆనంద్ సాగర్, సూరిశెట్టి ఉపేంద్ర, బండారు రవీంద్ర, పుల్లంశెట్టి ఉదయ్ కుమార్, బుడంపాడు కోటి, అందె వెంకటేశ్వరరావు, కోలా అంజి, తిరుపతిరావు, శెట్టి శ్రీను, కాశీ తదితరులు పాల్గొన్నారు.