ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలు

🔸 జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో
🔸 పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యమని నాయకులు వెల్లడి

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలను జనసేనపార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో ఆగష్టు 27 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు మరియు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) తెలిపారు. దీనికి సంబంధించి గురువారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా పార్టీ బలోపేతం చేసేదిశగా ఈ వారోత్సవాల కార్యక్రమాలు, ప్రజలతో మమేకమైన కార్యక్రమాలగా రూపొందించామని అన్నారు. కార్యక్రమంలో ముందుగా
ఆగష్టు 27 న స్వచ్ఛ భారత్ మరియు పారిశుధ్య కార్యక్రమం, 28 న పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టివినాయక ప్రతిమలు పంపిణీ, 29 న తెలుగుభాషా దినోత్సవం కూడా ఉండటంతో తెలుగుభాష కోసం కృషిచేసిన కొందరు మహనీయులకు సత్కారం, 30న జనసైనికులకు వీరమహిళలకు నాయకత్వంపై శిక్షణా శిబిరం, ఆగష్టు 31న వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు మరియు సర్వమత ప్రార్ధనలు, సెప్టెంబర్ 1 న పార్టీ విధివిధానాలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో కూడియున్న కరపత్రాలు పట్టణంలో మరియు గ్రామాల్లో పంపిణీ,
సెప్టెంబర్2 శుక్రవారం, పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో(కొత్త బిల్డింగ్)మెగా రక్తదానం నిర్వహించి, జన్మదిన వేడుకలతో ముగిస్తామని ఆదాడ తెలిపారు. మరో నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను నేటికి పది సంవత్సరాలుపైగా నిర్వహిస్తున్నామని, ఈసంవత్సరం వేడుకలు మాత్రం పార్టీ బలోపేతం దిశగా చేయటం సంతృప్తిగా ఉందని తెలిపారు. ఈ వారోత్సవ కార్యక్రమాల్లో మెగాఫ్యామిలీ అభిమానులు, ఝాన్సీ వీరమహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు హాజరయ్యి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంజనీపుత్ర మరియు జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, చిరంజీవి యువత ప్రతినిధి, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,కార్యదర్శి, జనసేన యువనాయకుడు లోపింటి కళ్యాణ్, పత్రి సాయి పాల్గొన్నారు.