నిఖిత హత్య విచారణ వెంటనే జరపాలి

  • నిఖిత హత్య వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం..!
    • దళిత బిడ్డకు న్యాయం చేయాలని దళిత ఎమ్మెల్యే ఎందుకు…? రాజీనామా చేయండి..!
  • నిఖితకు కుటుంబానికి న్యాయం జరిపేంత వరకు ఎటువంటి పోరాటానికైనా జనసేన సిద్ధం
  • జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననురు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వంకేశ్వరం గ్రామానికి చెందిన చిన్నారి నిఖితను ఇటీవల ఈ నెల 6వ తేదీన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిలో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా బంద్ ప్రకటించి, చిన్నారి నిఖిత హత్యకు విచారణ జరపాలని ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశ నిరసన ర్యాలీలో పాల్గొన్న వంగ లక్ష్మణ్ గౌడ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ… నిఖిత హత్యకు విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క నిరసన ర్యాలికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. చిన్నారి నిఖిత హత్య వెనుక ప్రభుత్వ అధికారుల మరియు అధికారుల హస్తం ఉందని జనసేన పార్టీ భావిస్తోంది. దీనికి అధికార పార్టీ నాయకులు మద్దతుగా ఉండటం సిగ్గుచేటు. తక్షణమే సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపి, దుండగులను కఠినంగా శిక్షించెంత వరకు జనసేన పార్టీ ఎటువంటి పొరటానికైన సిద్ధమని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే, ఎం.పి దళిత ఎం.పి, జిల్లా కలెక్టర్ దళిత కలెక్టర్ జెడ్పీ చైర్మన్ దళిత చైర్మన్ అయినా దళిత బిడ్డకు న్యాయం దొరకట్లేదు. 14 ఏళ్ళ పసి బిడ్డకు అన్యాయంగా ప్రాణం పోయినప్పుడు న్యాయం చేయాలని మీకు ఈ పదవులు ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, ఆఖరికి దళిత బిడ్డల మీద దాడులు చేస్తున్నారంటే ఈ అధికార పార్టీకి, నాయకులకు అధికార దాహం ఎంత స్థాయికి చేరుకుందో ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, ఎడ్ల రాకేష్, విక్కి, నాగరాజు, యాదయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.