కాలేజి విద్యార్ధులకు మౌళిక వసతులు కల్పించాలని జనసేన డిమాండ్

మదిర, బొనకల్ జూనియర్ కాలేజిలో బాయ్స్ టాయిలెట్స్ కి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జనసేన విద్యార్థి విభాగం మరియు జనసేన పార్టీ బొనకల్ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ ఆధ్వర్యంలో బోనకల్ ఇంటర్మీడియట్ కాలేజీలో బాయ్స్ టాయిలెట్స్ కి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, వాటర్ సదుపాయం కల్పించాలని మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ తో పాటు ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంధం ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కాలేజీలో విద్యార్థులకు టాయిలెట్స్ కి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున జనసేన విద్యార్థి విభాగం నుంచి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం వారు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా టాయిలెట్స్ కి వెళ్లడానికి వాటర్ సదుపాయం కూడా లేదు. కావున వాటర్ సదుపాయం కూడా కల్పించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ జానీ పాషా, మండల నాయకులు ఆది తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.