20 వ వార్డులో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన జనసేన కౌన్సిలర్

  • కోటి 3లక్షలు నిధులతో హైస్కూల్ అదనపు గదులు నిర్మాణానికి శంకుస్థాపన
  • సిసి డ్రైన్ శంకుస్థాపన

(శతఘ్ని న్యూస్ :కోనసీమ జిల్లా )అమలాపురం పురపాలకసంఘం 20వార్డు,జె ఎన్ పురపాలక ఉ న్నత పాఠశాలలో నాడు -నేడు రెండో విడత భాగంలో, కోటి మూడు లక్షలతో తొమ్మిది అదనపు గదులు నిర్మాణం కోసం పురపాలక చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి 20వ వార్డు జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం పురపాలక సంఘం 20వ వార్డులో జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి సిసి డ్రైన్ కు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ వార్డులో కొంకాపల్లి, ఏ వి ఆర్ నగర్, 216 హైవేకి ఆనుకొని ఉన్న డ్రైనేజ్ ను, సుమారుగా నాలుగు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ గా మార్పు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ వైస్ చైర్మెన్ రుద్రరాజు వెంకటరాజు(నాని రాజు), కౌన్సిలర్లు మట్టపర్తి నాగేంద్ర, సంసాని బులి నాని, నాగారపు వెంకటేశ్వరరావు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మంచి కంటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సిహెచ్ భారతి, మున్సిపల్ ఏఈ హేమంత్, ఎమినిటీ సెక్రటరి సిహెచ్ నందీశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఘన సత్యనారాయణ, ఎడ్యుకేషనల్ సెక్రెటరీ తరుణ్, సి ఆర్ పి ఎం అనూష మరియు పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.