జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యాచరణ సమావేశం

కుప్పం: చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పి హరిప్రసాద్ పిలుపు మేరకు ఆదివారం కుప్పం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు తిరుపతిలోని జిల్లాఅధ్యక్షులవారి కార్యాలయంలో గత 20 రోజుల నుండి చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కమిటీ కార్యదర్శి వామనమూర్తి, జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శులు వేణు, మునెప్ప, నవీన్ మరియు మండల అధ్యక్షులు కిషోర్, అమీర్, ప్రవీణ్, భాస్కర్ మరియు ఐటి వింగ్ మధు పాల్గొనడం జరిగింది.