మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంగళగిరి: జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలియజేశారు. జనసైనికులు ఏకమై రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన జగన్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలన విముక్తి కోసం ప్రజల క్షేమమే ముఖ్యమని ఉమ్మడిగా ఏకమైన జనసేన టిడిపి బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఓర్పు క్రమశిక్షణ నీతి నిజాయితీ ఓర్పు ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ప్రజల సంక్షేమం రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో జనసైనికులు వీర మహిళలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకొని ఈ సైకో జగన్ ప్రభుత్వాన్ని పారుద్రోలాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, గుంటూరు జిల్లా నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వీరమహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.