ఎస్ కే ఆర్ పురంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ

  • పవన్ కళ్యాణ్ లో ఒక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఉంది
  • చంద్రబాబు నాయుడులో ఒక అద్భుతమైన అనుభవత్వం ఉంది
  • రాష్ట్రానికి జనసేన తెలుగుదేశం అత్యంత ఆవశ్యకం
  • ఇద్దరూ ఇద్దరే.. ఒక అవకాశం ఇవ్వండి
  • రాయల పాలన తెస్తాం
  • జనసేన ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పాలసముద్రం మండలం, ఎస్ కే ఆర్ పురం గ్రామపంచాయతీలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. గ్రామంలో ఉన్న ప్రతీ ఇంటిని సందర్శించి, భవిష్యత్తు గ్యారెంటీ అంశాలను వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లో ఒక ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఉందని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు లో ఒక అద్భుతమైన అనుభవం ఉందని కొనియాడారు. వారిద్దరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభ్యున్నతి చెందడం ఖాయమని తెలిపారు. ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి జనసేన తెలుగుదేశం పార్టీ ఆవశ్యకమని తెలియజేశారు. ఒకసారి అవకాశం ఇవ్వండని, తర్వాత కాలంలో రాయల పాలన తీసుకొస్తామని హామీ ఇచ్చారు. బాలసముద్రం మండలాన్ని మరో వేటికన్ సిటీ చేస్తామని, డిగ్రీ కాలేజ్, స్పోర్ట్స్ అకాడమీ, తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతంలో రోడ్ల సమస్యల మీద, హంశాపురం నుండి టీవీఎన్ఆర్ పురం వరకు అడుగు మార్గం ఉన్న రోడ్డు కోసం ఆవరణ నిరాహార దీక్ష చేశామని, ఆ మీదటే ఇటీవల కాలంలో పాలసముద్రం మండలముతో పాటు, మిగతా ఐదు మండలాల్లో కూడా రోడ్లు వేశారని తెలిపారు. వన దుర్గాపురం నుండి పాలసముద్ర వరకు చక్కటి రోడ్డు నిర్మాణం కొరకు గతంలో నిరసన దీక్ష చేశామన్నారు. కానీ ప్రస్తుతం మంచి రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. రానున్న 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఒక స్థిరమైన మనసుతో, సంకల్పంతో, సాహసోపేతమైన ఒడంబడిక ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించి సంక్షేమ ఫలాలు అందించటానికి నడుం బిగించి ఉన్నారని, వారి ఇరువురికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం సాధ్యమని, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఇంటికి సాగనంపడం ద్యేయమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు వాసు నాయుడు, నియోజకవర్గ యువజన కార్యదర్శి కోదండన్, బాలసముద్రం మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బాలకృష్ణాపురం పంచాయతీ అధ్యక్షులు పాల్ రాజ్, కార్యదర్శి రమేష్ మదన్, జనసేన నాయకులు ముత్తు కుమార్, జాఫర్, ఢిల్లీ, అయ్యప్ప, అరుణ్, శేఖర్, విజయ్, పాండియన్, శశి, సాయికుమార్, ఆది, పాలసముద్రం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబశివన్, కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగర్ మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ చంద్రమౌళి, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ యువజన కార్యదర్శి అన్నమలై, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శి రుద్ర, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నంశెట్టి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *