వికలాంగుల సంక్షేమం మరచిన ప్రభుత్వం

  • వికలాంగుల సమస్యలపై భైంసాలో రాజస్వ మండల అధికారికి శుక్రవారం వినతి పత్రం

భైంసా: వికలాంగుల సమస్యలపై భైంసాలో రాజస్వ మండల అధికారికి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, అదేవిధంగా బీడీ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు కోరడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ నిధి కోసం అధికారులతో కమిటీ వేయాలి.
సదరం స్లాట్ బుకింగ్ 200 వరకు పెంచాలి, సర్టిఫికెట్ వున్న ప్రతి వికలాంగులకు బస్ పాస్, రైల్వే పాస్ లు ఇవ్వాలి, అంత్యోదయ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం ఇవ్వాలి, బిసి బందు, దళిత బందు, గృహ లక్ష్మి, డబుల్ బెడ్ రూం, తదితర అన్ని సంక్షేమ పథకాల్లో అర్హులను గుర్తించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా100 శాతం వున్న వికలాంగులకు పది వెయిలు పెన్షన్ ఇవ్వాలి, బ్యాక్ లాగ్ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. మరియు బీడీ కార్మికులకు వెంటనే 2016 పెన్షన్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాదాపు 30 రోజుల పని దినాలు కల్పించాలి, సరిపడా నాణ్యమైన బీడీ, ఆకు, తంబాకు ఇవ్వాలి, కుర్ కురే ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న బీడీ యాజమాన్యాల పై లేబర్ ఆఫీసర్ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల భవిష్యత్ లో జరిగే పోరాటాలకు అధికారులు, ఎమ్మెల్యే భాధ్యత వహించాల్సిన అవసరం వుంది.
ఈ కార్యక్రమంలో సాగర, గఫూర్, సంజీవ్, అశోక్, నరేష్, రాజు, శివ లక్ష్మి, రుక్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.