ప్రజా సమస్యలపై ప్రశ్నించే ఏకైక పార్టీ జనసేన

  • అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తాం
  • జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

ప్రజలా ఆస్థి హక్కులను హరించే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు చట్టాము 2022 యాక్ట్ 27/2023ను రద్దు చేయాలి అంటూ అడ్వకేట్స్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజు వారికి మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా.. ఎవరు సమస్యల్లో ఉన్నా.. ఆ సమస్య గురించి ప్రశ్నించే ఏకైక పార్టీ జనసేన పార్టీ. అడ్వకేట్స్ చేస్తున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 (యాక్ట్ 27/2023) రద్దు చేయాలి అని చేస్తున్న నీరసనకు మద్దతు పలికిన డాక్టర్ పసుపులేటి ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గోవింద గోవింద అనే విధంగా చేసిన వైసీపీ ప్రభుత్వం, ఆస్తులు గోవింద అనే చట్టాన్ని ఈ యొక్క జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 (యాక్ట్ 27/2023) ద్వారా ఎవరు సివిల్ కోర్టుకు వెళ్లకుండా రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆస్థికి సంబందించిన ప్రతిఒక్కటి వాళ్ళే చేసుకునే విధంగా చేసారు. దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజలా పరిష్కారం కోసం కాకుండా తన సొంత స్వలాభాలకోసం పని చేసేలా చట్టాలు తీసుకొని వచ్చాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్న కూడా వారి పనులు లేకుండా చేసారు. రెడ్ సండిల్ సంబందించిన అధికారులకు కూడా పనిలేకుండా చేసిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యం అని చెప్పారు. వీరు చేపడుతున్న పనులు అన్ని రాజ్యాంగ బద్దంగా కాకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా చేస్తున్నారు, ఆస్తుల సంబందించిన కేసులు ఏవైనా ఉంటే అవి సివిల్ కోర్టుకు వెళ్లి పరిష్కరించుకునేవారు, కానీ ఇప్పుడు జగన్ రెడ్డి తెచ్చిన చట్టం వాళ్ళ ప్రజలకు ఇబ్బందులు కలిగేలాగా చేస్తున్నారు. ఇలాంటి చీకటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని తెలియచేశారు. ఈ మధ్య మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో అడ్వకేట్స్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి చట్టాలను రద్దు చేసేవిధంగా పోరాడుతాం అని చెప్పారు. ప్రజలకు అండగ న్యాయవాదులు చేపట్టిన ఈ సమ్మెకు జనసేన, టీడీపీ మద్దతు తెలుపుతుంది అని తెలియచేసారు. రాబోయే రెండు నెలల్లో మా జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రజలా ప్రభుత్వం రాబోతుంది మా ప్రభుత్వం రాగానే ఇలాంటి చీకటి చట్టాలను రద్దు చేస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, సీనియర్ నాయకులు దంపూరి భాస్కర్, జనసేన జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఆనంద్, యువ నాయకులు చందు, తిరుపతి నగర కార్యదర్శులు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్,లోకేష్, పురుషోత్తం, మనోజ్ కుమార్, మంగళం అధ్యక్షుడు జనసేన సాయి, జనసైనికులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.