జనసేన జనజాగృతి యాత్ర 62రోజు

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్ర 62 రోజులో భాగంగా శుక్రవారం రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కూనవరం గ్రామ ఉపాధి హామీ రైతుకులీలతో ఉదయాన్నే పల్లె బాటలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ రైతుకూలీల సమస్యలు & గ్రామ సమస్యలు ప్రజలను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనవరం గ్రామ ఉపాధి హామీ రైతుకూలీలతో గురుదత్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు ఆత్మహత్య చేసుకున్న కవులు రైతులకు 30కోట్ల రూపాయలు 3000 మందికి అందించిన విషయాన్ని ఉపాధి హామీ 500మంది రైతుకూలీలకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కూనవరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రధానమైన సమస్య మంచినీళ్లు సమస్య. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ పూర్తిస్థాయిలో మంచినీటి సమస్యను పరిష్కరించే నాథుడే కరువయ్యారని ప్రజలు వాపోయారు. అలానే కూనవరం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, గురుదత్ కు ప్రజలు వివరించడం జరిగింది. కూనవరం గ్రామ ఉపాధి హామీ రైతుకూలీలకు ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటం జనసేన పార్టీ తరఫున మేడ గురుదత్ ప్రసాద్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, కూనవరం గ్రామ జనసేన పార్టీ సీనియర్ లీడర్ గేదల సత్తిబాబు, చిక్కాల నాగు, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి చిడిపి నాగేష్, రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళ కందికట్ల అరుణ, చదువు ముక్తేశ్వరరావు, గొల్లకోటి కృష్ణ, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజి కూనవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు ఉమ్మిడిశెట్టి సురేష్,మాధవరుపు నాని, మట్ట కృష్ణ, ఊడి సూరిబాబు, గేదల అగ్గిరాముడు, కడిమి వెంకటేష్, అడపా రాజు, దూలం కళ్యాణ్, సుంకర నాగేశ్వరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.