జనసేన పార్టీ రచ్చబండ

మైలవరం నియోజకవర్గం: ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని దామలూరు, చిలుకూరు, కాచవరం పంచాయతీ గ్రామాలలో జనసేన పార్టీ అధినేత, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రచ్చబండ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలను, విధి విధానాలను, పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను మండలంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ ప్రాముఖ్యత ను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యకర్తలతో జనసేన రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రజలను వారియొక్క గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.. మండలంలోని ప్రతి ప్రధాన సమస్యలపై జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం ఇంచార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధీ) మాట్లాడుతూ జనసేన పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ అని ప్రతి సామాన్యుడుకి మేలు జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మురి హనుమంతరావు, హరికిషోర్, పురం సురేష్, బాల మరియు జనసేన పార్టీ ఇబ్రహీంపట్నం మండల కార్యకర్తలు పాల్గొన్నారు.