వంగాయ గూడెం పంట బోదే సమస్యపై నేడు జనసేన నిరసన

ఏలూరు: స్థానిక 18వ డివిజన్ వంగాయగూడెం అంబేడ్కర్ బొమ్మ వెనకాల పంట కాలువ సమస్యను పరిష్కరించమని గతంలో జనసేన పార్టీ తరపున అధికారులకు తెలియజేసినా.. ఇప్పటివరకు నగరపాలక సంస్థ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ.. ఆ సమస్యను పరిష్కరించడంలో మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పంట కాలువ వ్యర్ధాలతో నిండిపోయి, దుర్వాసనతో 18వ డివిజన్ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పంట బోదే సమస్యను పరిష్కరించాలని, నగరపాలక సంస్థకు జనసేన పార్టీ తరఫున ఫిర్యాదు అందజేశామని, అప్పటికి ఏలూరు నగరపాలక సంస్థ మేయర్, స్థానిక శాసనసభ్యుడు ఆళ్ల నాని గాని, 18వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ కూడా స్పందించకపోవడంతో, జనసేన పార్టీ ఆధ్వర్యంలో, స్వయంగా యంత్రాలతో పంట బోధిలోని వ్యర్ధాలను తొలగించడం జరిగిందని, మరల పంట బోదే కూడికపోయి యదా తదంగా మురుగుతో నిండిపోవడంతో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు జనసేన ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని నగరపాలక సంస్థ అధికారులను హెచ్చరించారు. పంట బోధి సమస్యకు శాశ్వత పరిష్కారంకోరుతూశుక్రవారం ఉదయం 10 గంటలకు వంగాయగూడెంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసైనికులను కోరారు.