శ్రీకాళహస్తి: జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పట్టణంలోని నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నివాస గృహం వద్ద నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, నియోజకవర్గ నాయకులు, జనసైనికులతో కలిసి శుక్రవారం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో జనసేన పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజల సమస్యలపైన సమర్థవంతంగా పోరాడామని, 2023 లో పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు పై పోరాడి 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యేలా మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో పని చేసి నూతన సంవత్సరంలో నూతన ఉస్తాహంతో పని చేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, జనసైనికులకు ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కొట్టే సాయి, పద్మజ, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు గోపి, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు రవి కుమార్ రెడ్డి, నితీష్ కుమార్, చందు చౌదరి, బాలాజీ, త్యాగరాజులు, జనసైనికులు పాల్గొన్నారు.