అనంతపురం అర్బన్ లో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసం అయితే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయం నెరవేరే వరకు జనసేన పార్టీకి పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎంతమంది ఎన్ని విషప్రచారాలు చేస్తూ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని కించపరిచిన వాటన్నిటిని సవాళ్లుగా తీసుకొని నిక్కచ్చిగా ఖండిస్తాం, ఎదిరించి నిలబడతాం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న, ఎన్ని సీట్లు తీసుకున్న ఎవరిని అభ్యర్థుల్నిగా నిర్ణయించిన కలిసికట్టుగా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సర్వశక్తులు వడ్డి పనిచేస్తాం. జనసేన – టిడిపి – బిజెపి కూటమిని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేస్తాం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయమే మా నిర్ణయం.