కంచికచర్ల ఈఎస్ఐ డిస్పెన్సరీ తీరుపై జనసేన నిరసనగళం

*వైకాపా ప్రభుత్వంలో అధ్వాన్న స్థితికి చేరుకున్న కంచికచర్ల ఈఎస్ఐ

*అరు నెలల క్రిందటే మూత పడ్డ కంచికచర్ల కార్మిక బీమా డిస్పెన్సరీ..

*12.10.2018న రాష్ట్ర వ్యాప్తంగా 16 కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అందులో నందిగామ నియోజక వర్గం లోని సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల కొరకు కంచికచర్ల కేంద్రంగా గ్రాంటు కాబడినది.

*కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్ నకు రూ. 25000/- అద్దె చెల్లింపు చేస్తూ వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తన పుట్టిన రోజున మంచి పని చేయాలని ఉంది అని వచ్చి ది 26.10.2019న అధికారికంగా ప్రారంభించినారు.

*అనంతరం సిబ్బందిని కేటాయించకుండా మూత పెట్టడంతో ది 26/10/2020 న జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద నిరసనతో తెరిపించి నా కానీ తగిన స్టాఫ్ ను, ఇచ్చి తగిన పని వేళలు ఇవ్వకుండా చేసి ఇప్పుడు దానిని శాశ్వతంగా మూత పెట్టారు.

*నందిగామ నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది ఈఎస్ఐ చందాదారులు ఉన్నారు. వారి మీద ఆధార పడిన కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 15 వేల మందికి ప్రాథమిక చికిత్స కేంద్రంగా ఇది కేటాయించబడింది

*కానీ నేటి పాలకుల నిర్లక్ష్యానికి గురై మూతపడింది. ఇది ఒక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా కేటాయించబడిన 16 డిస్పెన్సరీ లకు ఇదే పరిస్థితి

*గడపగడపకు తిరుగుతున్న ఎమ్మెల్యేగారికి ఈఎస్ఐ గడప కనిపించకపోవడం దురదృష్టం

*కొండలు గుట్టలు ఇసుక మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పట్ల లేకపోయింది

*ఇంతమంది కార్మికుల మొర వినిపించకపోవడం బాధాకరం

*చిన్నచిన్న విషయాలపై రాజకీయం చేసే లోకల్ నాయకులకు ఈఎస్ఐ ఆసుపత్రి కనిపించక పోవడం శోచనీయం

*రాష్ట్రవ్యాప్తంగా 16 డిస్పెన్సరీలు ప్రారంభానికి నోచుకోక ముందే మూతపడ్డాయి

*83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెన్యువల్ ప్రాసెస్ ఆగిపోయి మూడు సంవత్సరాల కాలం జరిగిపోయింది

*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 78 ఈఎస్ఐ డిస్పెన్సరీలో మందులు లేక కార్మికులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు

*రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు మరియు వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు ఈ విషయాలపై తక్షణమే శ్రద్ధ వహించి కార్మికుల పక్షాన నిలబడి వారికి వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు కల్పింపచేయాలని డిమాండ్ చేయడమైనది

ముఖ్యంగా 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా రిమోట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం ఆయా ప్రాంతాలలో ఉన్న కార్మికులకు ఉపయోగపడింది కానీ వాటిని మూసివేయటం కార్మిక శాఖ అలసత్వం కావున వైద్య మరియు కార్మిక శాఖ మంత్రి ఇరువురు కూడా ఈ విషయాల పైన చర్చించి తక్షణమే వాటిని ప్రారంభించి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలాగా వైద్య చికిత్సలు అందజేయాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి కుమారి నియోజకవర్గ నాయకులు పూజారి రాజేష్, కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్, నియోజకవర్గ నాయకులు వెంకటేశ్వర రావు, వీర మహిళలు పద్మావతి, లక్ష్మి యాదవ్ రమాదేవి, విజయ, నాగ లక్ష్మి, వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, జన సైనికులు వేణుగోపాలు, రాజశేఖర్, శ్రీనివాస్, నాగరాజు, అజయ్, నాని, తాటి విజయ, సత్యనారాయణ, గురునాధం, ఖాసిం, అజారుద్దీన్, స్వామి, సైదులు, హేమంత్, నరసింహ, సురేష్, మరో యాభై మంది కార్యకర్తలు పాల్గొనీ కంచికచర్ల పట్టణ వీధులలో నిరసన తెలిపి ఎం.ఆర్.ఓ కు వినతి పత్రం అందజేశారు.