తిక్కవరపాడు, గొలగమూడి, కంటేపల్లి రోడ్ల దుస్థితిపై జనసేన నిరసన

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి నుంచి నెల్లూరుకు వెళ్లేందుకు వెంకటాచలం రైల్వే గేటు దాటాల్సి ఉండగా, ఈ రైల్వే గేటు ప్రతి 3 నెలలకు ఒకసారి మూత పడుతుండటంతో గేటు మరమ్మతులకు గురైతే ప్రత్యామ్నాయ రోడ్డు తిక్కవరపాడు, గొలగమూడి, కంటేపల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉందని, ఈ రోడ్డుపై భారీ గుంటలని పూడ్చాలని జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. సర్వేపల్లితోపాటు చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు నెల్లూరుకి వెళ్లాలంటే వెంకటాచలం రైల్వే గేటు మీద వెళ్లే పరిస్థితి. ఈ రైల్వే గేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి రిపేర్ వచ్చినప్పుడు సర్వేపల్లి గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా తిక్కవరప్పాడు, గొలగమూడి మీదుగా నెల్లూరుకు వెళ్లే రోడ్డు మార్గం గుండా వెళ్లే పరిస్థితి. అయితే తిక్కవరపాడు దాటిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉంది. గేటు రిపేర్ అయినప్పుడు ఈ గుంటల రోడ్ లోని పోవాల్సిన పరిస్థితి. ఈ విషయంపై జనసేన పార్టీ తరఫున ఎన్నోసార్లు నిరసనలు తెలియజేశాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులుగా వచ్చి ఎవరో కూడా ఈ రోడ్డు పైన ఉన్న గుంటలను పూడ్చాలనే ఆలోచన గాని, కనీసం రోడ్డుని పూర్తిస్థాయిలో నిర్మించాలనే ఆలోచన కానీ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అత్యవసరమైతే అంబులెన్స్ కూడా వెళ్లాలంటే మధ్యలోనే ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి. ఎవరైనా ప్రెగ్నెన్సీలు అయితే వాళ్ల పరిస్థితి ఇంకా చెప్పనవసరం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కనీసం ఐదు కిలోమీటర్ల రోడ్డు పై ఉన్న గుంటలని పూడ్చే పరిస్థితుల్లో లేకపోవడం సిగ్గుతో కూడిన విషయం దయచేసి ఇకనైనా సరే మంత్రిగారూ ఈ ఐదు కిలోమీటర్ల రోడ్డుని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ఇవ్వండి అని జనసేన పార్టీ నుంచి నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వానికి సురేష్ నాయుడు హెచ్చరిక చేసారు.