సి.జి రాజశేఖర్ ఆద్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర

జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా బోయినపల్లి, నరసాపురం గ్రామాలలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ పర్యటన

పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నాయకులు నాయకల్ బాబ్జి, మధుసూదన్, ఆగిపోగు నాగరాజ్, ఆధ్వర్యంలో జనసేన ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది.

ఈ సందర్బంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ నరసాపురం గ్రామంలో కొన్నిచోట్ల గత అనేక సంవత్సరాల క్రితం అరకొర సిసి రోడ్డు నిర్మించినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదు ఈ గ్రామంలో నిర్మించలేదు రోడ్లపై మురికి నీరు నిలిచిపోతున్నందున, కాలనీవాసులు మాకు కొత్త సిసి రోడ్డు నిర్మించి డ్రైనేజీ కాలువలు నిర్మించే విధంగా ఏర్పాటు చేయించండి అని ప్రాధేయపడ్డారు, ఈ గ్రామంలో కొంతమంది వ్యక్తులు తన గుప్పెటలో పెట్టుకొని ప్రజలు ఏమైనా ప్రశ్నిస్తే వారికి ఇబ్బందులు పెడుతున్నారని కొంతమంది మా దృష్టికి తీసుకు రావడం జరిగింది. వారు చెప్పిందే వేద హక్కు అనే విధంగా ఈ గ్రామంలో జరుగుతున్నందున సామాన్య ప్రజలు గళం ఎత్తలేక సైలెంట్ గా ఉండిపోతున్నామని మా దృష్టి తెచ్చారు, ఈ గ్రామంలో ఒక 75 సంవత్సరాల ముసలి అవ్వ నాకు పెన్షన్ రావడం లేదని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు తీశారని, నాకు దిక్కంటూ ఎవరూ లేరు, నాకు పని చేసుకునే అంతా శక్తి లేదు, నా దగ్గర నాకు అన్నం పెట్టే వారు కూడా నా అనే వాళ్ళు ఎవరు లేరని, నాకు ఉండడానికి ఒక ఇల్లు వచ్చే విధంగా మీరన్న చూడండి అని చెప్తుంటే బాధనిపించింది, అదేవిధంగా నాకు పెన్షన్ వస్తే నేను ఎవరిని అడుక్కోకుండా, నేను ఎలాగో ఒకలా బ్రతికేస్తానని తెలియజేశారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక ఏరియాలో ఒక సమస్య ఉంది, ఎలక్షన్ టైం లో మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎలక్షన్ టైంలో చెప్పిన ఎమ్మెల్యే గారు మా సమస్యలు ఎందుకు తీర్చడం లేదు. ఎలక్షన్లో తప్ప ఇప్పటివరకు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తామని చెప్పిన ఎమ్మెల్యే గారు ఇంతవరకు పర్యటించలేదని, ఆ కాలనీ వాసు తెలియజేశారు. అలాగే మరో గ్రామం బోయినపల్లి గ్రామంలో బిల్డింగుల్లో సిసి రోడ్డు అసలే లేదు మిట్టమీద ఏరియాలో త్రాగునీటి సమస్య ఉందని చెప్పారు. ఇప్పటికైనా ఈ గ్రామాలలో అభివృద్ధి చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, నాగేశ్వరరావు, పులి శేఖర్, తిరుపాల్, గద్దల రాజు, కాశి ,మాలిక్ భాష, కళ్యాణ్, మద్దిలేటి, సుధీర్, కిరణ్, హరి, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.