కంబదూరు జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

కళ్యాణదుర్గం, అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన ఆధ్వర్యంలో కంబదూరు మండలం కదిరిదేవరపల్లిలో మండల నాయకులు వెంకటేష్, శ్రావణి మరియు గ్రామ యువత నాగభూషణ, వినోద్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దాదాపు 200 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంబదూరు నాయకులు, శ్రీనినివాసులు, తిప్పేస్వామి, చరణ్, అనిల్, సురేష్, మునీంద్ర, రమేష్, హేమంత్, ఎర్రిస్వామి, రాజు తదితర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.