అనుశ్రీ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

రాజమండ్రి సిటీ, స్థానిక ఏవిఏ రోడ్డు రామాలయం సెంటర్ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో “జనంలోకి జనసేన” కార్యక్రమం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిటీ ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించి సత్యనారాయణని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా బాటసారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. అక్కడ నుంచి జనంలోకి జనసేన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. రాజమండ్రి సిటీ పరిసర ప్రాంతాలు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇవ్వడంతో మంచి విశేషస్పందన వచ్చింది. సత్యనారాయణ ప్రతి షాపుకు మరియు ఇళ్లకుకు వెళ్లి కరపత్రాలు పంచుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ఆశయాలు ప్రజలకు తెలియజేస్తూ జనంలోకి జనసేన అనే కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి నియోజకవర్గంలో అధికార పార్టీ చేస్తున్న దోపిడీని ప్రజల తరపున ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, వారి సమస్యలు తెలుసుకుంటూ ఈ కష్టాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అని, త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఆయన యాత్ర సాగింది. అదేవిధంగా ఎండలో చాలా తీవ్రతంగా ఉండడం వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు మా జనసేన పార్టీ మజ్జిగ మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసం అలాగే సేవా కార్యక్రమంలో ముందు ఉంటుంది అన్నారు. అదే మీరు అధికారం ఇస్తే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని సత్యనారాయణ తెలియజేసారు. ఒక్క అవకాశం ఇస్తే మార్పు తెచ్చి చూపిస్తామని అనుశ్రీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లాటి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శి కెల్లా జయలక్ష్మి, దేవకివాడ చక్రపాణి, రాష్ట్ర ప్రధాన చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి జనసేన యువ నాయకులు బయ్యపునీడి సూర్య, మరియు 28వ వార్డు జనసైనికులు విక్టరీ వాసు, పదవ వార్డ్ భారతి, మంచాలు సునీల్, మానే ఆది బాబు, వెంకటేష్ దుర్గాప్రసాద్, ఏడి ప్రసాద్, ప్రేమ్ కుమార్ దుర్గాప్రసాద్ ఏసు కుమార్ మరియు తదితరులు స్థానికులు పాల్గొన్నారు.