సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన జనసేన వైస్ ఎంపిపి

రాజోలు, మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం రాజోలు జనసేన వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు ప్రశ్నించడం జరిగింది.

విద్యాశాఖ : జాతీయ రహదారి పక్కనున్న స్కూల్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని అన్నారు అధికారుల మధ్య సమన్వయ లోపంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించడం జరిగింది.

ఎంపిడిఒ: ఇటీవల ఓఎంజిసికి పర్యావరణేతర చర్యలపై 22 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని వీటిలో కొంత సొమ్ము రాజోలు ఏరియా హాస్పిటల్ నందు డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించాలని మండల పరిషత్ లో తీర్మానం చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపిడిఓని కోరడం జరిగింది.

రవాణా శాఖ: రాజోలు బస్టాండ్ నుండి సాయంత్రం ఐదు గంటలకు పాలకొల్లు, రైల్వే స్టేషన్ బయలుదేరి ఆర్టీసీ బస్సు రైల్వే స్టేషన్ వెళ్లే ప్రజలకు సరిపోతలేదని మరొక బస్సు ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

రహదారులు మరియు భవనాల శాఖ: గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని కనీసం రోడ్లు మరమ్మతులు అయిన చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే చింతలపల్లి గ్రామం పోతుమట్ల ఆంజనేయస్వామి గుడి దగ్గర నుండి రుద్రవారి మెరక వినాయకుడు దగ్గర వరకు ఆర్ అండ్ బి రోడ్డు వెయ్యాలని కోరడం జరిగింది.

ఇరిగేషన్ డిపార్ట్మెంట్: చింతలపల్లి గ్రామంలో కాలవల శుభ్రత చేయాలని కోరడం జరిగింది.
మండల అధ్యక్షులుకి : నా పరిధిలో ఎంపిపి స్కూల్ పిప్పళ్ళ వారి మెరక నా స్కూలుకి పిల్లలకు రక్షణగా ప్రహరీ గోడ నిర్మించాలని తీర్మానంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

పోలీస్ శాఖ: నెంబర్ బోర్డు లేని మోటార్ సైకిల్ సీజ్ చేయాలని మరియు వేగ నియంత్రణ జరక్కుండా చూడాలని పోలీస్ శాఖ వారికి తెలియడం జరిగింది.

దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ: చింతలపల్లి గ్రామంలో పూర్వం నిర్మించబడిన శివాలయం కోసం పై అధికారులకు తెలియపరిచి మళ్లీ కొత్తగా నిర్మించాలని కోరడం జరిగింది.