జనసేనాని జన్మదినాన పలు సామాజిక సేవా కార్యక్రమాలు

  • తిరుపతి జనసేన పార్టీ వెల్లడి..

తిరుపతి: జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ శనివారం ఉదయం 7:30 నిమిషాల నుండి సాయంత్రం 6:30 వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, హేమకుమార్, సుభాషిని, కీర్తన, రాజేష్ ఆచారి, లక్ష్మి, రాజమోహన్, చందన, గుట్టా నాగరాజు, దుర్గాదేవి, రమేష్, హిమవంత్, మనోజ్, హేమంత్, బాలాజీ, ఆది, పురుషోత్తమం, కిరణ్, ప్రసాద్, విశ్వ, కౌశిక్, వంశీ, బాషా తదితరులతో కలిసి రాజా రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బైరాగి పట్టెడలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం 730 గంటలకు వైకుంఠపురం ఆర్చి వద్ద భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం, అనంతరం 9 నుండి 12 గంటల వరకు బైరాగి పట్టేడ తమ పార్టీ ఆఫీసు నందు మెగా రక్తదాన శిబిరం, 12 నుంచి 1:00 వరకు స్కావెంజర్స్ కాలనీ (చేపల మార్కెట్) వద్ద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు పంపిణి, అన్నదాన కార్యక్రమం, 1:30 నుంచి 2:30 మధ్య హర్ష టయోటా షోరూం వెనక వున్న ఆశ్రయ వృద్దల ఆశ్రమం (తిరుచానూరు రేణిగుంట హైవే బైపాస్) అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు తిరుచానూరు లోగల నవజీవన్ అనాధ ఆశ్రమం లో వృద్ధులకు దుప్పట్లు, నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. జనసైనికులంతా హాజరై ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.