వెంకటేష్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

ఉమ్మడి కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, కొత్తపాలెం గ్రామంలో ఇటీవల కాలంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతు మరియు జనసేన పార్టీ మద్దతు దారుడైన కాలితిరిపి వెంకటేష్ కుటుంబాన్ని జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ శ్రేణుల తరపున 25,000/- రూపాయలు సహాయాన్ని వారి కుటుంబానికి అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డెలు సుధాకర్, వీరులపాడు మండల అధ్యక్షులు బేతంపూడి జయరాజు, సురా సత్యనారాయణ, ఆకుల వెంకట్ మరియు జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.