గుడ్లూరు జనసేన ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

  • కృష్ణాపురంలో జనసైనికుల పర్యటన
  • జనంలోకి జనసేన 2వ రోజు

గుడ్లూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పులి మల్లికార్జున ఆదేశాలు మేరకు గుడ్లూరు మండల జనసైనికులు జనంలోకి జనసేన రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాయుడు పాలెం పంచాయతీ, కృష్ణాపురం గ్రామ ఎస్సీ కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులు మట్లాడుతూ ఏ గ్రామాల్లో, పల్లెల్లో, కాలనీల్లో ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సమస్యలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు, పేదలకు పించన్లు, తాగు నీటి సదుపాయాలైన బావులు బోర్లు మరమ్మతులకు గురయితే వాటిని బాగు చేయలేకపోవడం వంటి చిన్నచిన్న మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేని ఈ వైకాపా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారేమో బటన్ మాత్రం నొక్కుతారు. మరి ఆ బటన్ నొక్కిన నిధులు అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలుగా ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. ఇనుగంటి కోటమ్మ భర్త కోటయ్య (లేట్) కోటయ్య కు గత ప్రభుత్వం నుంచి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. కోటయ్య చనిపోవడంతో అప్పటికి వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. కోటయ్య భార్య కోటమ్మకి వృద్ధాప్య పింఛను లేదా వితంతువు పింఛను ఇవ్వకుండా భర్త కోటయ్య పేరు మీద ఉన్న ఆరు ఎకరాల పొలాన్ని సాకుగా చూపిస్తూ పింఛను ఇవ్వడం లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని బటన్ నొక్కడం ద్వారా అర్హులైన వారికి పథకాలు ఎలా అందుతాయి. పార్టీ చూడం.. మతం చూడం.. కులం చూడం.. అని చెప్పి ప్రజలను మభ్య పెట్టారు. వాలంటరీ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇంకా బొక్క రాగమ్మ భర్త బొక్క మాలకొండయ్య మరియు మండలంలోని మిట్టపాలెంలో రామిశెట్టి దయ గార్లకు వస్తున్నటువంటి ఫించను మధ్యంతరంగా ఆపివేశారని, అర్హులు అయ్యుండి పథకాలు అందడం లేదని వాలంటీర్ వ్యవస్థ సజీవాలయ వ్యవస్థ అవినీతికి పాల్పడుతున్నారే కానీ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బటన్ రెడ్డి గారికి బాగా గుణపాఠం చెబుతామని గుడ్లూరు మండల జనసేన నాయకుడు అన్నంగి చలపతి వద్ద గ్రామ ప్రజలు వాపోయారు. చలపతి గారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన వాలంటీర్ మరియు సచివాలయ వ్యవస్థలు లంచాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అవినీతికి పాల్పడ్డ వారికి తగిన శిక్ష విధిస్తాం అని చెబుతుంటే నవ్వు వస్తుంది. గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు నాయకులకు అధికారులకు ఇటువంటి సమస్యలు కనపడలేదా రాజకీయ లబ్ధి కోసం అర్హులు కాని వారికి సంక్షేమ పథకాలు అందినప్పుడు అర్హులుగా ఉన్న వారికి ఎందుకు ఇవ్వటం లేదు సాకులు ఎందుకు చెబుతున్నారు. అదేవిధంగా మండలంలోని శివాలయం ఎస్సీ ఎస్టీ కాలనీలో దాసరి ఏడుకొండలు ప్రమాదంలో కాలు పోయి వికలాంగుడు అయి మూడు సంవత్సరములు గడిచిన పింఛను రాకపోని పక్షంలో జనసేన పోరాటం చేసి పత్రికల ప్రకటనల ద్వారా అతనికి త్వరలో పింఛన్ వస్తుందని అధికారులు చెప్పడం జరిగింది. ప్రజలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మోసాన్ని గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వ పతనాన్ని కనులారా చూస్తారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో మనం పులి మల్లికార్జున గారిని గెలిపించుకుని, తద్వారా ఎలాంటి రాజకీయ మచ్చలు లేని, నిజాయితీ పరుడు, నిత్యం ప్రజాక్షేమం కోసం పరితపించే పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, అమోస్, రాంబాబు ఉలవపాడు మండలం నుంచి ప్రతాప్ మరియు స్థానిక యువత శ్యామ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.