జనంలోకి జనసేన సిద్ధాంతాలు కార్యక్రమం – 26వ రోజు
- జనంలోకి జనసేన సిద్ధాంతాలు.. గ్రామ గ్రామాన ఇంటింటికి జనసేన
- కరపత్రాలను అందజేసిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య
సిద్ధవటం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 26.వ రోజు మండలంలోని వంతాటిపల్లి, నిత్యపూజ కాలనీ, జ్యోతి గ్రామం
పలు గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జనసేన పార్టీ విధివిధానాలు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో రూపొందించిన అంశాలను సామాన్య ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి కళ్యాణ్, ఆవుల రాజా, పాలకొండరాయుడు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-30-at-5.01.20-PM.jpeg)