కమర్షియల్ టాక్స్ కార్యాలయం తరలింపు ఆపాలి: జనసేన

నూజివీడు: కమర్షియల్ టాక్స్ కార్యాలయం నూజివీడు నుండి ఏలూరు తరలించటాన్ని ఎమ్మెల్యే, అధికారులను ఆపాలని జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. నూజివీడు, తిరువూరు నియోజకవర్గలు, బాపులపాడు దానికి కలిపి ఉన్న ఈ సహాయ కమిషనర్ కార్యాలయం ఉండేదన్నారు. ఇప్పుడు బాపులపాడు మండలం గుడివాడ సహాయ కమిషనర్ కార్యాలయం పరిధిలోకి వెళ్ళగా, తిరువూరు నియోజవర్గం ఇబ్రహీంపట్నం సహాయ కమిషనర్ పరిధిలోకి వెళ్లిందని అన్నారు. దీనితో ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, నూజివీడు మాత్రమే మిగలడంతో ఈ కార్యాలయాన్ని ఏలూరులో తరలించాలని చూస్తున్నారని దీనిపై ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. టౌన్ కీ తలమానికంగా ఉన్న ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఏలూరు తరలిపోతుంటే ఎమ్మెల్యే నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. ఏలూరు జిల్లా వద్దు అని రౌండ్ టేబుల్స్, సదస్సులు, సంతకాల సేకరణ, ధర్నాలు, జీపు యాత్రలు, నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేస్తూ కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఆర్.డి.ఓ , ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి పోరాడుతుంటే చోద్యం చూసారనీ, కనీసం మద్దతు తెలియ చేయలేదనీ, పోలీసులతో నిరసనదీక్ష టెంట్ లు పీకిన, ఎండలో నిరహరదీక్ష లు చేసేలా చేసి ఆనందించారని అన్నారు. జేఏసీ రెండు సంవత్సరాలుగా పోరాడుతుంటే ఆ పోరాటాలను ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఈ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పాలనలో నూజివీడు చరిత్ర మసకబారి అభివృద్ధి నిరోధకంగా మారిందని నూజివీడు అభివృద్ధి జనసేన తోనే సాధ్యం తెలిపారు.