పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, పురుషోత్తపల్లి గ్రామంలో జనసేన నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీరెడ్డి వెంకటరత్నం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతలను ప్రతి ఇంటికి ప్రచార పత్రాలను పంపిణి చేస్తూ, మా నమ్మకం నువ్వే స్టికర్లను అంటించారు. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ కారింకి వరప్రసాద్, యడ్లపల్లి సత్తిబాబు, అన్నపురెడ్డి అమ్మిరాజు, కస్తూరి వెంకట సుబ్బారావు, కొయ్యి ప్రసాద్, పిడుగు వీరబాబు, పురుషోత్తపల్లి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.