మన రోడ్డు.. మన హక్కు నినాదంతో జనసైనికుల వినూత్న నిరసన

*పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామంలో ఎంపీటీసీ మొఖమాట్ల కృష్ణ కాంత్ ఆధ్వర్యంలో మన రోడ్డు.. మన హక్కు నినాదంతో జనసైనికులు వినూత్న నిరసన

*బురద నీటితో నిండిన రోడ్డు గుంతలలో వరి నాట్లు వేసి..పడవలు వదిలిన జనసైనికులు

*సరైన రోడ్డులు లేక ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

*ప్రభుత్వం  ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.. తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్

ఆచంట నియోజకవర్గం: 2019లో జరిగిన ఎలక్షన్లు తదనంతరం గ్రామంలోకి విచ్చేసిన ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథ రాజు.. రామన్నపాలెం గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నా ఈ గ్రామానికి వైభోగం వచ్చేసింది.. ఈ గ్రామంలో ఏ విధమైన సమస్యలు లేకుండా నేను చూసుకుంటా అని చెప్పి నేటికీ మూడు సంవత్సరాలు దాటినప్పటికీ ఇంత వరకు ఏ ఒక్క సీసీ రోడ్డు గానీ, నూతనంగా డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడం గ్రామం పట్ల ఎమ్మెల్యే గారికి ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుందని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెనుగొండ మండల జనసేన అధ్యక్షులు కంబాల బాబులు మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే ఇదేనా పూర్వం పడవల మీద ప్రయాణించే వాళ్ళు ఈరోజు రామన్నపాలెం గ్రామం రావాలంటే పడవలు వేసుకొని వచ్చే విధంగా రామన్నపాలెం గ్రామాన్ని తయారు చేశారు.
ఈ వైసీపీ ప్రభుత్వంలో వ్యక్తిగత విమర్శనం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమం చేయరు, చేయలేరు, ఈ పప్పు బెల్లం పథకాలు మాకొద్దు.. మాకు కావలసిన మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీస్, త్రాగునీరు అనేక రకాల సమస్యలు ఉన్నాయి..
ఆ సమస్యలు పరిష్కరించండి అంతేగాని వ్యక్తిగత దూషణలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి మానవాళికి మంచిది కాదు, ఈ సమస్యను అర్థం చేసుకోండి వెంటనే రామన్నపాలెం గ్రామంలో అన్ని రోడ్లు, డ్రైనేజీలు, నిర్మించాలి లేకపోతే భవిష్యత్తులో మా ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామని హెచ్చరిస్తున్నాం, తదనంతరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అందుబాటులో లేని కారణంగా ఉప సర్పంచ్ గారైన పడాల ప్రేమ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించి, తదుపరి ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది, తదుపరి ఎండిఓ కి వినపత్రం సమర్పించడం జరిగినది, తదనంతరం మండల ప్రెసిడెంట్ పోతినీడి వెంకటేశ్వరరావు కు వినతి పత్రం సమర్పించి.. సమస్యను వీరందరికీ తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు జి సురేష్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, మండల కమిటీ సభ్యులు ఏడిది కుమార్, పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు భీమవరపు సత్యసాయిరాం, తామరాడ గ్రామ పార్టీ అధ్యక్షులు పిల్లి సత్యనారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దార్లంక మారుతి,
యర్రంశెట్టి దుర్గారావు మరియు రామన్నపాలెం గ్రామ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.