అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అండ

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలం, కుమిలి గ్రామంలో గత వారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన టమటాపు సోమునాయుడు అప్పయ్యమ్మల కుటుంబాన్ని జనసేన పూసపాటిరేగ మండల కార్యవర్గం ఆదివారం ఉదయం పరామర్శించి వారికి కుమిలి జనసేన నాయకులు కె.అంజిబాబు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించి, 4వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. వారికి ప్రభుత్వం నుంచి వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ మండలంలో ఇన్ని అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా ప్రభుత్వాదికారులు చోద్యం చూస్తూ కూర్చోవడం చాలా భాదాకరమైన విషయమని‌, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఏరకంగానూ చర్యలు తీసుకోవడం లేదని భాదితుల సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు దిశగా జనసేన పార్టీ తరపున నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, డెంకాడ మండల అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, అంజి, స్మార్ట్ రమేష్, బావిశెట్టి నారాయణరావు, లెంక సురేష్, పైల శ్రీనివాస్, రెడ్డి హరీష్, దుక్క అప్పలరాజు, టంకాల రామోజీరావు, అదపాక సూరిబాబు, బీరక నరేష్, మాదేటి ఈశ్వర్రావు, జానకీరామ్, అల్లాడ జగదీష్, దేశెట్టి వంశీ, మర్రి నూకరాజు, గుండపురెడ్డి గోవిందరావు, వాసు‌, గంగిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.