మాకినీడి ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు

• జగనన్న కాలనీలు సాకారం కాని పేదల సొంతింటి కళ
• ప్రచార ఆర్భాటాలే కాని ప్రభుత్వ పనితీరు క్షేత్రస్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదు
• జగన్ రెడ్డి జూన్ 2021 పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు 2022 నవంబర్ వచ్చిన ఇంకా చాలా వరకు పునాదులకే నోచుకొని జగనన్న కాలనీలు
• పేదలకు న్యాయం జరిగేందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాజిక పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టాం
• ఎమ్మెల్యే, ఎంపిలని హెచ్చరిస్తున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించడంలో పెట్టిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద చూపించండి

‌పిఠాపురం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహించు జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 12వ తేది మొదటిరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి నియోజవర్గంలో గ్రామల్లో అవినీతి వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆమె పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం దేవుడేరుగ ముందు ఇక్కడికి రావడానికి సరైన రహదారి కూడా లేదు స్థానిక ఎమ్మెల్యే సొంత బంధువుల లాభం కొరకు ఊరికి దూరంగా ఉన్న భూములను మార్కెట్ రేటు కంటే ఎక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశారన్నారు. ఇటు ప్రజలకు కూడా న్యాయం చేయకుండా మూడున్నర సంవత్సరాలు వట్టి కాగితం చూపించి కొంతమందికి వారి స్థలం కూడా చూపించకుండా కాలం వెళ్లబోశారు. ఇప్పటికైనా నిద్రపోయిన ప్రభుత్వ యంత్రాంగం మేలుకొని పట్టలు ఇచ్చిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, వారి సొంత ఇంటి నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. గడప గడపకు కాదు మీరు ఇచ్చిన స్థలాల్లో కూర్చుని చూడండి వాటి పరిస్థితి మీకు అర్థమవుతుంది వర్షం వస్తే వాహనాలపై కాదు పడవ మీద రావాల్సి ఉంటుందని అన్నారు. తాటిపర్తి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను పరిశీలించి స్థానిక లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాటీపర్తి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు ఇరువైపులా హై టెన్షన్ వైర్లు, స్థలం మధ్యలో ఓఎన్జిసి గ్యాస్ పైపులు, కనీసం స్థలాలను కేటాయించారని, లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం కూడా ఆసక్తి చూపటం లేదని ఈ వైఖరిని మీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించవల్సి వుంటుందని ఆమె విమర్శలు గుప్పించారు. అనంతరం కొడవలి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలను పరిశీలించి స్థానిక లబ్ధిదారులను వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో ఈ గ్రామానికి ఇచ్చిన స్థలాలు నిదర్శనం అని దాదాపు ఊరికి పది కిలోమీటర్ల దూరంలో కనీసం రోడ్డు సదుపాయం కూడా లేకుండా కొండల మధ్యలో ఇచ్చారు అన్నారు.ఈ కార్యక్రమంలో.గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ రామకృష్ణ వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, గోపు సురేష్ బుర్రా సూర్యప్రకాష్,దాసం కొండబాబు, మేళం బాబీ, యండ్రపు శ్రీనివాస్, సామినీడి అప్పారావు, అడబాల వీర్రాజు, నక్క నారాయణమూర్తి, గారపాటి శివ కొండారావు, పెద్దింటి శివ, పప్పినీడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.