రోడ్ల విస్తీర్ణంలో స్థలాలు కోల్పోయిన బాధితులకు జనసేన అండ

మైలవరం నియోజకవర్గం: మైలవరం నుండి నూజివీడు వెళ్లే మార్గంలో వెల్వడం మరియు చంద్రాల గ్రామాలలో రోడ్ల విస్తీర్ణంలో 127 మంది ఇళ్లు మరియు స్థలాలు కోల్పోయి 17,86,34,405/-కోట్ల రూపాయాలు నష్ట పరిహారం ఇవ్వవలసన బాధితులకు అండగా జనసేన పార్టీ నిలిచి ఆ గ్రామాల్లో బాధితులతో కలిసి నిరసన చేపట్టారు. అక్కడికి పోలీసు వారు వచ్చి నిరసన తెలిపిన జనసేన నాయకులను బాధితులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ)మైలవరం, మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు ఉదయ్ పడిగల, రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందరరామిరెడ్డి, నాయకులు బత్తిన శ్రీనివాస్, తోట క్రాంతిబాబు, కర్రి శివ, మల్లారపు దుర్గాప్రసాద్, ఆకుతోట ఈశ్వర్, ఆనం అవినాష్, వీర్ల పౌలురాజు, కూసుమంచి కిరణ్, చిన్నాల భరత్, గోలి మణికంఠ మరియు జనసైనికులు, బాధితులు పాల్గొన్నారు.