రోడ్డు ప్రమాదానికి గురైన నర్తు. కోదండరావు కుటుంబానికి జనసేన అండ!

గత కొన్ని రోజుల క్రితం గుజరాత్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సోంపేట మండలం, రాజాం గ్రామానికి చెందిన వలస కూలీ నర్తు. కోదండ రావు కుటుంబానికి జనసేన 100 సోల్జర్స్ సంస్థ అధ్వర్యంలో ఇచ్చాపురం జనసేన సమన్వయ కర్త శ్రీ దాసరి రాజు చేతుల మీదగా 7500రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీల కు అతీతంగా సేవా సంస్థలు ముందుకు వచ్చి నర్తు. కోదండ రావు కుటుంబాన్ని ఆదుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డొక్కారి ఈశ్వర్ రావు, దుంగు భాస్కర్ రావు, భాస్కర్, దివాకర్, చంద్, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.