గోదారిగుంటలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ 9వ డివిజన్ గోదారిగుంట రామాలయం ప్రాంతం నందు సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కటారి శ్రీను, టి.వి.వి సత్యన్నారాయణల ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలని కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నాలుగున్నర ఏండ్ల కాలంలో దళితుల జీవితాలు పాతాళానికి దిగజారిపోయాయని వాపోతున్నారనీ, ఎక్కడ చూసినా ప్రోత్సాహకాలు లేక నిరుత్సాహానికి గురవుతున్నారన్నారు. ఎస్.సి & ఎస్.టి కార్పోరేషన్ ఎక్కడ ఉందో భూతద్దం వేసి వెతకాలిసిన దుస్థితి నేడు వచ్చిందనీ దీనంతటికీ కారణం ఈ వై.సి.పి ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. ఇంత దారుణమైన పాలన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడలేదనీ, ఎప్పుడు ఈ ప్రభుత్వ కాలం ముగుస్తుందా అని ఎదురుచుస్తున్నారంటే ప్రజలు ఎంతవిసిగి వేసారి ఉన్నారో అర్ధంచేసుకొవచ్చు అన్నారు. తదుపరి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, టీవీ సత్యనారాయణ, మలికి అప్పన్న, దూడ అప్పారావు, కటారి శీను, రవిశంకర్, సుంకర సురేష్, చీకట్ల వాసు, పచ్చిపాల మధు, బండి సుజాత, బట్టు లీల, చోడిపల్లి సత్యవతి, మిరియాల హైమావతి, సోనీ ఫ్లోరెన్స్, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.