దొంగ ఓట్లను తొలగించాలి: జనసేన డిమండ్

మదనపల్లి: మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ పోలింగ్ బూత్ ల ప్రకారం ఓటర్ల జాబితా సర్వేచేసినపుడు ఓటరు జాబితాలో ఓకే బూత్ లో ఒకే డోర్ నెంబర్ తో సుమారుగా 30, 40, 70 ఓట్లు ఉండడంతో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి గారు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి దొంగ ఓట్లను తొలగించాలని బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డివో మురళికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ రాజకీయా పార్టీ లు రెవిన్యూ అధికారులపైన, బిఎల్ఓలపైన, ఎలక్షన్ అధికారులపైన ఎంత ఒత్తిడి తెచ్చినా ఈ దొంగ ఓట్లను తీసివేయడంలో దొంగ ఓట్ల సంఖ్య తగ్గుతుందే కానీ పూర్తిగా దొంగ ఓట్లను తొలగించలేకపోతున్నారని అన్నారు. కొత్త ఓటరు లిస్ట్ వచ్చిన వెంటనే మరో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఎలక్షన్ అధికారులు దొంగ ఓట్లను తోలగించకపోతే రాయచోటిలో కలెక్టర్ గారికి అవసరమైతే రాష్ట్ర ఎలక్షన్ అధికారుల దృష్టి తీసుకొనిపోయి న్యాయం జరిగే వరకు జనసేన టీడీపీ పార్టీలు కలసి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, సరోజ, తోట కళ్యాణ్, గిరి, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, లవన్న, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతం, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మి నారాయణ, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, రూరల్ ప్రధాన కార్యదర్శి ఆది నారాయణ, పవన్ శంకర, జనార్దన్, నరేష్, నరేంద్ర, అయాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.