మేడ గురుదత్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం రాయుడు థియేటర్ నందు జనసేనాని పుట్టినరోజు సందర్బంగా కేక్ కటింగు చేసిన జనసేన పార్టీ మేడ గురుదత్ ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర రాజానగరం జనసేన పార్టీ ఎంపిటిసి రమణ (డబ్బు) యూత్ ఐకాన్ పల్లా హేమంత్ మండల కమిటీ మెంబెర్స్ సీనియర్ నాయకులు అడబాల సత్యనారాయణ జనసైనికులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతో అశేష ప్రజాధారణ పొందిన తిరుగులేని కథానాయకుడు ఆయనే… అకుంఠిత దీక్షా సాధకుడు. అభిమానుల ఊపిరై నడిపించే చోదకుడు. కోట్లాది భవిష్యత్తుకై ఆయన కలగన్న దిశగా కొట్లాడుతున్న నాయకుడు.! జనం లోంచి పుట్టిన జన నాయకుడు.