వైపీపీ పాలనలో మైనారీటీల అభివృద్ధి లేదు

  • మూత బడిన ముస్లిం మైనారిటీ స్కూల్ & హాస్టల్ ను పరిశీలించిన అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు టౌన్ నందు ముస్లిం మైనారిటీ నాయకుల అధ్వర్యంలో సోమవారం మూత బడిన ముస్లిం మైనారిటీ స్కూల్ & హాస్టల్ ను అనంతపూర్ జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ పరిశీలించారు.
దీనిని మైనారిటీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు, ప్రజాధనంతో నిర్మించిన భవనం నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో గొప్పగా ప్రంభించిన వాళ్ళు గాలికి వదిలేశారు. తర్వాత అధికారం చేపట్టిన వైస్సార్సీపీ నేటికీ అటువైపు కూడా చూడలేదు. అధికారంలోకి వచ్చి 4 సంవ్త్సరాలు దాటినా ముస్లిం మైనారిటీలను ఏ మాత్రం లెక్క చేయడం లేదని ఘాటు వ్యాఖ్యను ఇచ్చారు. ఈ సంద్భంగా వైస్సార్సీపీ పార్టీ ముస్లిం మైనారిటీలను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తుంది తప్ప అభివృద్ధి విషయంలో మాత్రం అమడ దూరం ఉంది వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల నాయకులు షేక్ జీలన్ బాషా, ఫిరోజ్ ఖాన్, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్(ఎల్ ఎల్ బి), యువ నాయకులు తాడిపత్రి మహేష్ కుమార్, ఆర్.సి సురేష్ కుమార్(ఎల్ ఎల్ బి) తదితరులు పాల్గొన్నారు.