అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జనసేన మీడియా సమావేశం

నెల్లూరు: శ్యాం బాబు విత్ లపాకీ బట్ నో తుపాకీ.. అనే టైటిల్ ని రిజిస్టర్ చేసి త్వరలో ఒక చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నాం.. అందులో హీరోగా శ్యాం బాబు కాకపోతే మా కాంబాబు (ఆంబోతు)ని హీరోగా పెట్టి తీస్తాం.
అంటూ నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎవరు అనేది సగం మందికి తెలియకుండానే పోయింది. ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరు అనేది వారు వారు చేసిన అభివృద్ధిని ఆ శాఖలో చేసిన పనులను ప్రెస్ మీట్ పెట్టి గతంలో వివరించేవారు. వైసీపీ వచ్చిన తర్వాత మంచి మంచి సంప్రదాయాలు వచ్చాయి ఎవరెవరైతే మంత్రులయ్యారో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని దూషించడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పిస్తే వారు చేసిన అభివృద్ధి చెప్పుకోలేరు ఎందుకంటే సాధించింది ఏమీ లేదు. బ్రో సినిమాలో ఒక పనికిమాలిన వెధవ తాగుబోతు, తిరుగుబోతు క్యాండెట్ కి శ్యామ్ బాబు అనే పాత్రను పత్రికా మీటింగ్ పెట్టి అది నేనే అని ఒప్పుకున్నట్టుగా ఉంది అంబటి రాంబాబు గారి ప్రవర్తన. వారి శాఖలలో సాధించింది ఏమీ లేకపోయేటప్పుడికి తాము ఉన్నాం గుర్తించాలని ఇటువంటి ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ఉంటారు. మేము కూడా మంచి కథ ప్లాన్ చేశాం. మా వద్ద పెద్దగా డబ్బులు లేవు కాబట్టి ఓటిటిలో దీనిని తెలియజేయడానికి చూస్తున్నాం. కథలో హీరో శ్యాంబాబు గాలికి తిరుగుతుండేవాడు మొదటినుంచి బాగా రాసలీలల్లో తేలి ఆడుతూ ఉంటాడు. కొత్త కొత్తగా ఎవరెవరు వచ్చారు ఏమేమి చేస్తారు అడిగి కనుక్కుంటూ ఉంటాడు.. గొప్ప పనిమంతుడు శక్తి ఉన్న లేకపోయినా నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. బాధ్యతలు మరిచి సినిమా మొత్తం పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు. ఆ మూవీకి మిత్రులందరికీ ఒక మంచి సినిమా టైటిల్ని నిర్ణయించాలని కోరుకుంటున్నాను.. మేము అనుకున్న టైటిల్స్ వరుసగా సుకన్య ఏం చేస్తుంది గంట అరగంటా ముసలోడు గాని సరసానికి ఆంబోతే.. నో తుపాకీ కానీ వాంటెడ్ లపాకీ పని తక్కువ తపనెక్కువ సంబరాల శ్యాం బాబు ఈ టైటిల్స్ పరిశీలించి మిత్రులు ఒకటి ఫైనల్ చేయవలసిందిగా కోరుతున్నాను.. పవన్ కళ్యాణ్ గారికి మీలా అక్రమ సంపాదన తెలియదు. కష్టపడి సినిమాల్లో నటించి ఇంత రాణించారు. మీలాగా ఆడియో లీకేజీలు గాని మరే ఇతర చెడునూ ఆయనను వేలెత్తి చూపించలేరు. కష్టపడి సంపాదించుకొని కోట్ల రూపాయలు కౌలు రైతులకు మరెందరికి ఆర్తులకు సహాయం చేస్తున్నారు. ఆయన సినిమాలు చేస్తే వచ్చిన మీకు వచ్చిన నష్టం ఏమిటి బ్రో సినిమాకి లాస్ అయితే మీరేమైనా నష్టపరిహారం చెల్లిస్తారా. ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రెస్ మీట్ లు పెట్టి సినిమాలకు రివ్యూలు ఇస్తారా సినిమా రివ్యూలు ఎందుకు ఇవ్వాలి. అధికారం శాశ్వతం కాదు మీ నోటితో అందరికీ శత్రువులుగా మారకండి. రాబోయే ఎన్నికల్లో మీకు ఎలాగో డిపాజిట్లు రావు మీరు ఏ విధంగా ప్రజలకి మేలు చేయలేరు.. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూస్తూ ఊరుకోరు.. మీరు కూడా భారీ మూల్యం చెల్లించుకోవస్తుంది అని జనసేన పార్టీ తరఫున తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కృష్ణ పెన్న జిల్లాల వీర మహిళా రేణుక, హైమా, జిల్లా కార్యదర్శి ప్రశాంత్, హేమచంద్ర యాదవ్, శరవణ, ఖలీల్, బన్నీ, సాయి, శ్రీను, బన్నీ, వర్షన్, షారు, ఖాసిఫ్, ఋషి, షాజహాన్, మౌనిష్, కేశవ తదితరులు పాల్గొన్నారు.