యు.పి.రాజు ఆధ్వర్యంలో జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు

రాజాం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకుల్లో భాగంగా రాజాం నియోజకవర్గం నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం స్థానిక బస్టాండ్ వద్ద అన్నదానం చేశారు. అనంతరం దివ్యాంగుల పాఠశాలలో పండ్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పలు సేవకార్యక్రమాలు చేపడుతున్నామని. పవన్ కళ్యాణ్ గారు ప్రజలుకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీ స్థాపించారు అని, ప్రజలు పక్షాన నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సారి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు, ఎన్ని సత్యనారాయణ, వీరమహిళ కుమారి, నాలుగు మండలాల నాయకులు రమేష్ హరిబాబు, నాగరాజు, శ్రీనివాస్, ఈశ్వర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.